నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 7న జరగాల్సిన ఎన్నిక సరైన కోరం లేక వాయిదా పడింది. ఫలితంగా ఈరోజు ఎన్నికను నిర్వహించారు.
బోధన్ మున్సిపాలిటీలో ఏకగ్రీవంగా ఎన్నికైన కో-ఆప్షన్ సభ్యులు
బోధన్ మున్సిపాలిటీలో నలుగురు కో-ఆప్షన్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన సభ్యులకు స్థానిక ఎమ్మెల్యే షకీల్ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
బోధన్ మున్సిపాలిటీలో ఏకగ్రీవంగా ఎన్నికైన కో-ఆప్షన్ సభ్యులు
ఏకగ్రీవంగా ఎన్నికైన నలుగురు సభ్యులకు ఎమ్మెల్యే షకీల్ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యేకు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఇటీవల మరణించిన బోధన్ మున్సిపాలిటీ కౌన్సిలర్ భర్త బాబర్, తెరాస మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గుణ ప్రసాద్‌ల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు.
ఇదీచూడండి..'కరోనా చీకటికాలంలో వెలుగు రేఖ.. తెలంగాణ వ్యవసాయ రంగం'