CM KCR Tributes to Vemula Manjulamma Death :రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. ప్రశాంత్ రెడ్డి తల్లి వేముల మంజులమ్మ(76) అనారోగ్యంతో.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ క్రమంలో నేడు మంత్రి స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌కు సీఎం కేసీఆర్ వెళ్లారు. అక్కడ మంజులమ్మ భౌతికకాయానికి నివాళులు(CM KCR Pays Tribute to Manjulamma) అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. సీఎం వెంట స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉదయం 9.50 గంటలకే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటికి చేరుకోవాల్సిన సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 12.30 గంటలకు అక్కడకు చేరుకున్నారు. ప్రగతి భవన్ నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి వెళ్లారు.
వేముల మంజులమ్మ భర్త వేముల సురేందర్ రెడ్డి తెలుగుదేశం హయాంలో నిజాం ఫ్యాక్టరీ ఛైర్మన్‌గా పని చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా విధులు నిర్వహించారు. తదనంతరం 2016లో ఆయన మృతి చెందగా.. ఇప్పుడు మంజులమ్మ మృతి చెందారు. ఆ దంపతులకు ప్రశాంత్ రెడ్డితో పాటు మరో కుమారుడు శ్రీనివాస్ రెడ్డి, కుమార్తె రాధిక ఉన్నారు.
Minister Prashanth Reddy VS MLA Bajireddy Govardhan : 'మంత్రిగారు.. మాకూ నిధులు కేటాయించండి..' అధికారపార్టీ నేతల మధ్య ఆసక్తికర సంభాషణ
CM KCR Recovered from Viral Fever : బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దాదాపు 25 రోజుల తర్వాత బయటకు వచ్చి నిజామాబాద్‌లోని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తల్లి మరణానికి నివాళులు అర్పించడానికి వెళ్లారు. వైరల్ జ్వరంతో బాధపడిన కేసీఆర్.. ఈ మధ్య కోలుకున్నారు. మరోవైపు ఆదివారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. వైరల్ ఫీవర్‌తో బాధపడిన సీఎం కేసీఆర్‌కు ఛాతిలో సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న కేసీఆర్.. మెల్లిగా కోలుకున్నారు.
దీని కన్నా ముందు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత.. భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం వినాయక చతుర్ధి రోజు వినాయకుడి విగ్రహాన్ని ప్రగతి భవన్లో ఏర్పాటు చేసి సీఎం కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. ఆ తర్వాతి రోజు నుంచి సీఎం కేసీఆర్ బయటకు రాలేదు. నాలుగు రోజుల తర్వాత మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన తర్వాత కేసీఆర్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నారని అందరికీ తెలిసింది. ఆ తర్వాత ఛాతిలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్తో బాధపడ్డారు. ఇప్పుడు వాటి నుంచి కోలుకొని.. ఎన్నికల ప్రచారానికే సిద్ధమయ్యారు.
CM KCR Election Tour : సీఎం కేసీఅర్ ఎన్నికల సభల షెడ్యూల్ ఖరారు.. ఈనెల 15 నుంచి నవంబర్ 9 వరకు..
BRS Manifesto 2023 Release Date : ఈ నెల 15న బీఆర్‌ఎస్ మేనిఫెస్టో.. నవంబర్ 9న కేసీఆర్ నామినేషన్లు