నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం అంబగిరిలో పోడుదారులు ఆందోళనకు దిగారు. సమీప అటవీ ప్రాంతంలో సంబంధిత అధికారులు చేపట్టిన కందకాల తవ్వకాలను అడ్డుకున్నారు. 2006వ సంవత్సరం నుంచి భూమిని నమ్మకుని జీవిస్తున్న తమకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోడుదారులకు, అటవీ అధికారులకు మధ్య ఘర్షణ - పోడుదారుల ఆందోళన
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం అంబగిరిలో.. పోడుదారులకు, అటవీ అధికారులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పోడు భూములను నమ్మకొని జీవిస్తున్న తమకు అన్యాయం చేస్తున్నారని అధికారులపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
tribes protest
ఆయా భూములకు సంబంధించి.. గతంలో తమకు పట్టాలు కూడా ఇచ్చారని గిరిజనులు తెలిపారు. అటవీ భూములంటూ ఇప్పుడు తమ పొలాలను సాగు చేసుకోకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. పోడుదారులకు నచ్చజెప్పినా వారు వినకపోవడంతో.. అధికారులు పనులను తాత్కలికంగా నిలిపివేశారు. భూమికి సంబంధించిన ఆధారాలను రెండు రోజుల్లో చూపించాలని సూచించి.. అక్కడి నుంచి వెనుదిరిగారు.