విధి నిర్వాహణలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఆశా వర్కర్లకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించాలని సీఐటీయూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. డీఎంహెచ్ఓను కలిసి వినతి పత్రం అందజేశారు.
'మృతి చెందిన ఆశా వర్కర్లకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి' - Asha workers probelms
ఆశా వర్కర్లకు పారితోషికాలు ఎంతో చెప్పకుండా.. వారితో 'కొవిడ్ ఇంటింటి సర్వే'ను చేయించడం సరైంది కాదని సీఐటీయూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ అభిప్రాయపడ్డారు. వర్కర్లకు కరోనా రక్షణ పరికరాలు ఇవ్వాలని కోరారు. కొవిడ్‌తో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Asha workers ex gratia
కొవిడ్‌తో మృతి చెందిన సావిత్రి, వసంత కుటుంబాలకు.. చెరో ఒక ఉద్యోగం చొప్పున ఇచ్చి వారిని ఆదుకోవాలని నూర్జహాన్ విజ్ఞప్తి చేశారు. ఇంటింటి సర్వేలో ఆశా వర్కర్లకు కరోనా రక్షణ పరికరాలు కల్పించాలని కోరారు. వర్కర్లకు పారితోషికాలు తెలపకుండా సర్వే చేయించడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గోవర్ధన్, ఆశ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రాజమని, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ రేటు.. తీవ్రత తగ్గే అవకాశం