నిజామాబాద్‌లో సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ ఉన్న డివిజనల్ కార్యాలయాన్ని ప్రాంతీయ స్థాయి కార్యాలయంగా స్థాయి పెంచుతున్నట్లు తెలిపిన ఆయన.. ఐఏఎస్ హోదా ఉన్న అధికారి డైరెక్టర్‌గా నేరుగా మంత్రిత్వ శాఖకు నివేదించేలా కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
నిజామాబాద్‌లో సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయం - nizamabad news
సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయం నిజామాబాద్‌లో ఏర్పాటైంది. ప్రస్తుతం అక్కడ ఉన్న డివిజనల్ కార్యాలయాన్ని ప్రాంతీయ స్థాయి కార్యాలయంగా స్థాయి పెంచుతున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్‌కు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధన్యవాదాలు తెలిపారు.
ప్రాంతీయ బోర్డు ఏర్పాటుపై కేంద్ర వాణిజ్య శాఖ సాయంత్రం అధికారంగా ఉత్తర్వులను జారీ చేసింది. పసుపు రైతులకు మేలు జరిగేలా అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని.. అందుకు కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్‌కు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధన్యవాదాలు తెలిపారు. పసుపు బోర్డు ఒక్కటే వస్తే సరిపోదని.. ఎగుమతులు సహా అన్ని మౌలిక వసతుల కోసం సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఆయన చెప్పారు.
ఇదీ చూడండి:ఫొటోలు ఎందుకు... లాభాలు కావాలి: సీఎం కేసీఆర్