నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం దసరా తర్వాత బతుకమ్మజరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నట్టు అక్కడి ప్రజలు తెలిపారు. ఆడపడుచులు అందంగా ముస్తాబై... రంగురంగుల పువ్వులతో చేసిన బతుకమ్మలతో గ్రామంలోని హనుమాన్ ఆలయం ముందు ఆడిపాడారు.
దసరా తర్వాత బతుకమ్మ.. ఆ గ్రామ ఆనవాయితీ! - edapalli bathukamma celebrations impoortance
ఆ గ్రామంలో ఏటా దసరా తర్వాత బతుకమ్మ వేడుకలను జరుపుకుంటారు. ఇదే అక్కడి ఆనవాయితీ మరి. ఇదెక్కడో కాదు... నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలోనే. ఇవాళ ఘనంగా బతుకమ్మ సంబురాలు జరుపుకున్నారు.
దసరా పండుగ తర్వాత బతుకమ్మ.. ఆ గ్రామ ఆనవాయితీ!
అనంతరం గ్రామ చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ వేడుకల్లో బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా పాల్గొన్నారు. జడ్పీ వైస్ చైర్పర్సన్ రజిత.. ఆమెను శాలువతో సత్కరించారు.
ఇదీ చదవండిఃమెల్బోర్న్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు