2024 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగవేసేది భాజపానేనని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు. సభ్యత్వ నమోదు పరిశీలన కోసం దత్తాత్రేయ ఈ రోజు నిజామాబాద్‌కు వచ్చారు. తెరాస పార్టీకి ప్రత్యామ్నాయం ఒక్క భాజపానేనని పునరుద్ఘాటించారు. భాజపాలో చేరేందుకు డి. శ్రీనివాస్‌తో పాటు మరికొంత మంది కాంగ్రెస్, తెరాస ఎంపీలు ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. తెరాస కంచుకోటైన నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాలను కాషాయదళం కైవసం చేసుకోవడం చూస్తుంటేనే... తెరాస పతనం ప్రారంభమైనట్లు అర్థమవుతుందన్నారు. దత్తాత్రేయ ఆధ్వర్యంలో కొంతమంది మహిళలు పార్టీలో చేరారు. అనంతరం జిల్లా కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు.
'2024లో భాజపా జెండా ఎగరేస్తాం..' - CONGRESS
2024లో తెలంగాణలో భాజపానే అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ధీమా వ్యక్తం చేశారు.
'2024లో భాజపా జెండా ఎగరేస్తాం..'