Babli project Gates Opened: మహారాష్ట్రలో గోదావరి నదిపై అడ్డంగా కట్టిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు తెరుచుకున్నాయి. కేంద్ర జలవనరుల సంఘం నియమించిన పర్యవేక్షక కమిటీ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారుల బృందం నేడు గేట్లు తెరిచి 0.6 టీఎంసీల నీటిని వదులుతున్నారు.
Babli project Gates Opened: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తిన అధికారులు
Babli project Gates Opened: నిజామాబాద్ కందకుర్తి వద్ద త్రివేణి సంగమం జలకళను సంతరించుకుంది. మహారాష్ట్రలో గోదావరిపై అడ్డంగా కట్టిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు తెరుచుకోవడం వల్ల గోదావరి జలాలు దిగువకు వస్తున్నాయి. కేంద్ర జలవనరుల సంఘం నియమించిన పర్యవేక్షక కమిటీ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారుల బృందం నేడు గేట్లు తెరిచారు.
తెరుచుకున్న బాబ్లీ గేట్లు.. కందకుర్తి వద్ద జలకళ
ఈ జలాలతో నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి జలకళను సంతరించుకుంది. నదీ జలాలు దిగువకు వదులుతున్నందున తీర ప్రాంతాల రైతులు, మత్స్యకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇదీ చదవండి:మోహన్‌బాబు, విష్ణు పేరిట పేదల భూపట్టాలు .. సోషల్ మీడియాలో విమర్శలు..!
Last Updated : Mar 1, 2022, 11:05 PM IST