నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు షీ టీంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, విద్యార్థినుల పట్ల ఆకతాయిలు దురుసుగా ప్రవర్తిస్తే షీ టీం నెంబర్లకు సంప్రదిస్తే తాము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఎస్.ఐ భూమయ్య తెలిపారు. నిజామాబాద్ జిల్లా షీ టీం నెంబర్ కి కానీ, డయల్ 100 కి కానీ ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే సత్వరమే న్యాయం చేస్తామన్నారు.
బోధన్ లో షీం టీంపై అవగాహన సదస్సు
విద్యార్థినుల పట్ల ఆకతాయిలు దురుసుగా ప్రవర్తిస్తే షీ టీం నెంబర్లకు సంప్రదిస్తే తాము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు షీ టీంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
బోధన్ లో షీం టీంపై అవగాహన సదస్సు
ఫిర్యాదు ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అమ్మాయిలు ఒంటరిగా ఉన్నపుడు ఏమైనా సంఘటనలు జరిగితే తమకు తెలపాలని సూచించారు. షీ టీం ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో కూడా ఫిర్యాదులు స్వీకరిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇవీచూడండి:కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్ను ప్రారంభించిన కేటీఆర్