ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ నగరంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డయాబెటిక్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాలిటెక్నిక్ మైదానం వద్ద ఈ కార్ ర్యాలీని నిజామాబాద్ ఏసీపీ జి. శ్రీనివాస్ కుమార్ జెండా ఊపి ప్రారంబించారు.
నిజామాబాద్లో మధుమేహంపై అవగాహన ర్యాలీ - latest news of diabetic
వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా నిజామాబాద్ నగరంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డయాబెటిక్స్ పై అవగాహన కల్పించేందుకు కార్ ర్యాలీ నిర్వహించారు. మధుమేహ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు.
నిజామాబాద్లో మధుమేహంపై అవగాహన ర్యాలీ
ప్రజలకు షుగర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించడం కోసం ర్యాలీ నిర్వహించడం అభినందనీయమని ఏసీపీ పేర్కొన్నారు. మధుమేహ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మధుమేహ నివారణ కోసం యోగా వ్యాయామం, ఉదయపు నడక చేయాలని ఆయన సూచించారు. లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ ఇరుకుల వీరేశం, కార్యదర్శి డి.యాదగిరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మధుమేహులకు ఊరట... ఆ ధరలు ఇక తగ్గనున్నాయట!