ఏఐటీయూసీ నిజామాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న రైల్వేల ప్రైవేటీకరణకు నిరసనగా నిజామాబాద్ రైల్వే స్టేషన్ ముందు ధర్నా నిర్వహించి అనంతరం స్టేషన్ మేనేజర్‌కు వినతి పత్రం సమర్పించారు. మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యానికి పూనుకుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య ఆరోపించారు. దాంట్లో భాగంగానే రైల్వేలో లాభాల్లో ఉన్న వాటిని ప్రైవేటు వ్యక్తులకు అమ్మటానికి సిద్ధపడుతున్నారని విమర్శించారు. అధికారులు, ఉద్యోగులు, కార్మికులు ప్రజల కృషితో రైల్వే సంస్థ లాభాల్లో నడుస్తోందన్నారు. కానీ మోడీ ప్రభుత్వం దుర్బుద్ధితో రైల్వేను కమీషన్ల కోసం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర చేస్తోందని విమర్శించారు.
రైల్వేల ప్రైవేటీకరణకు నిరసనగా ఏఐటీయూసీ ధర్నా - ఏఐటీయూసీ నిజామాబాద్ జిల్లా సమితి
రైల్వేల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యానికి మోదీ ప్రభుత్వం పూనుకుందని ఏఐటీయూసీ నాయకులు ఆరోపించారు. రైల్వేను ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని డిమాండ్ చేశారు.
రైల్వేల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐటీయూసీ ధర్నా
ఇప్పటికైనా మోదీ తన ఆలోచనను ఉపసంహరించుకోవాలని... రైల్వేను ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని డిమాండ్ చేశారు. లేని యెడల కార్మిక సంఘాలతో ప్రారంభమైన ఈ పోరాటం ప్రజా ఉద్యమంగా మారుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి.నర్సింగ్ రావు, జిల్లా నాయకులు పి.సుధాకర్, రాజన్న, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: నిషా కోసం నిరీక్షణ... కరోనా ఉన్నా డోంట్ కేర్..!