కేంద్రం తీసుకొచ్చిన నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టినట్లు ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసకృష్ణన్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో అన్ని చోట్లా సంతకాల సేకరణ జరుగుతోందని.. పూర్తయ్యాక రాష్ట్రపతికి అందిస్తామని తెలిపారు. తద్వారా కొత్త చట్టాలను రద్దు చేయాలని కోరతామని చెప్పారు.
'ఎన్నికలకు డబ్బు ఇవ్వడం కాదు.. రైతులకు పరిహారం ఇవ్వండి'
ఎన్నికలకు డబ్బు ఖర్చుపెడుతున్న ప్రభుత్వం.. రైతులకు పరిహారం అందించేందుకు మాత్రం వెనకాడుతోందని ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్ ఆరోపించారు. రైతులకు వ్యతిరేకంగా చేసిన చట్టాలను ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని నిజామాబాద్ వేదికగా డిమాండ్ చేశారు.
'ఎన్నికలకు డబ్బు ఇవ్వడం కాదు.. రైతులకు పరిహారం ఇవ్వండి'
ఎన్నికల్లో టన్నుల కొద్దీ నిధులు గుమ్మరిస్తున్న పార్టీలు.. పంటలను కోల్పోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు మాత్రం వెనుకాడుతున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు నిధులు ఇస్తోన్న కార్పొరేట్లకు వత్తాసు పలుకుతూ వారి కోసమే రైతు చట్టాలని తెచ్చాయని ఆరోపించారు.
ఇదీ చూడండి:ఎమ్మెల్సీ ఓటరుగా పేరు నమోదు చేసుకున్న వరంగల్ అర్బన్ కలెక్టర్