నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో ఓ ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ అవ్వగా... డ్రైవర్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రయాణికులను రక్షించాడు. తాను ప్రాణాలొదిలి బస్సులో ఉన్న ప్రయాణికులను కాపాడాడు. హైదరాబాద్ నుంచి బోధన్‌కు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు డిచ్పల్లి సమీపంలోకి రాగానే బస్సు బ్రేకులు పనిచేయలేదు.
ప్రయాణికుల కోసం ప్రాణాలు వదిలిన డ్రైవర్ - డిచ్‌పల్లిలో డ్రైవర్ చనిపోయి ప్రయాణికులను కాపాడాడు
ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలైనా, తన ప్రాణాల్ని పణంగా పెట్టిన డ్రైవర్ ప్రయాణికులను రక్షించాడు. ఈ ఘటన నిజమాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో జరిగింది.
ప్రయాణికుల కోసం ప్రాణాలు వదిలిన డ్రైవర్
అప్రమత్తమైన డ్రైవర్ మారుతి... బస్సును రోడ్డు పక్కనున్న ఇనుప కమాన్‌కు ఢీకొనగా బస్సు ఆగింది. ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. మరో ఇద్దరికి గాయాలవ్వగా నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తమ ప్రాణాలు కాపాడిన డ్రైవర్ మరణించడం పట్ల ప్రయాణికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ఇవీచూడండి: మంచి, చెడు స్పర్శలపై మీ పిల్లలకు చెప్పారా
Last Updated : Dec 16, 2019, 4:16 PM IST
TAGGED:
డిచ్పల్లి బస్సు ప్రమాదం