నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుటఆశా కార్యకర్తలు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కనీస వేతనం రూ.18వేలు చెల్లించాలని 2015లో సమ్మె చేశామని, ఆనాడు సీఎం కేసీఆర్ రూ.6 వేల వేతనాన్ని ఇస్తామని చెప్పి ... రూ. 1,500 మాత్రమే పారితోషికాన్ని పెంచి ఇస్తున్నారని పేర్కొన్నారు.
నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆశా కార్యకర్తల ధర్నా
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఆశాలకు రూ.21 వేల వేతనం చెల్లించాలని, ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆశా కార్యకర్తల ధర్నా
ఎన్నికల అనంతరం ఆశాల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. కరోనా సమయంలో పనిచేస్తున్న వారికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. పాత బకాయిలను వెంటనే చెల్లించాలని, ఆశాలకు రూ.21 వేల వేతనం చెల్లించాలన్నారు. ఉద్యోగ భద్రత, పెన్షన్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:కరోనా కట్టడి.. తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులతో గవర్నర్ సమీక్ష