నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మల్ గ్రామానికి చెందిన ముప్పేడ గంగారం ఏడాదిన్నర క్రితం ఉపాధి కోసం విదేశాలకు వెళ్లారు.పది రోజుల కిందట అస్వస్థత గురయ్యారు. సోమవారం రాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు తమకు సమాచారం వచ్చిందని ఆయన కుమారుడు నరేష్ తెలిపారు. మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గంగారం మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ట్వీట్ చేశారు.
ఇరాక్‌లో గుండెపోటుతో నిజామాబాద్ వాసి మృతి - nizamabad
నిజామాబాద్ జిల్లా వెల్మల్ గ్రామానికి చెందిన ముప్పేడ గంగారం ఇరాక్‌లో గుండెపోటుతో మృతిచెందారు. మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి పంపాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చాలంటూ ఎంపీ ధర్మపురి అర్వింద్ ట్వీట్ చేశారు.
vఇరాక్‌లో గుండెపోటుతో నిజామాబాద్ వాసి మృతి