పొలంలో ఫ్యాన్
పచ్చటి పొలాల మధ్య ఓ ఫ్యాన్ తిరుగుతుంది. అదేంటి అనుకుంటున్నారా.. రాత్రింబవళ్లు కష్టపడి పండించిన పంటను కాపాడుకోవడానికి ఓ యువకుడు చేసిన వినూత్న ప్రయోగం. అదేంటో మీరు చూడండీ.
పొలంలో ఫ్యాన్
పంట పొలం పక్కన... నిరంతరం చప్పుడు చేసే ఓ పరికరాన్ని తయారుచేశాడు. ఫ్యానుకు రెక్కల బదులుగా ఇనుప గొలుసు, గజ్జెలు అమర్చాడు. సాయంత్రం పూట ఫ్యాన్ వేసి ఇంటికి వెళ్తున్నాడు. రాత్రిపూట ఆ శబ్ధంతో జంతువుల బెడద తగ్గింది. కేవలం 500 రూపాయలతో దీనిని తయారు చేశాడు. దీనిని చూసిన చుట్టుపక్కల రైతులు కూడా తమ పంట చేలలో అమర్చుకుంటామని చెబుతున్నారు. ఆరుగాలం కష్టం కాపాడుకునేందుకు యువరైతు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది.
Last Updated : Feb 19, 2019, 4:48 PM IST