నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత స్కూల్లో పదో తరగతి చదువుతున్న మనోజ్‌కు హాల్ టికెట్ ఇవ్వలేదని విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. జనవరి నెలలో కేరళ టూరుకు తమ కుమారుడు వెళ్లనందుకు పరీక్షల సమయంలో ఇలా హాల్ టిక్కెట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టటం సరికాదని వారు వాపోయారు.
గత కొన్ని రోజులుగా హాల్ టికెట్ ఇవ్వమని అడిగితే కొంత డబ్బు ఇవ్వాలని యాజమాన్యం విద్యార్థిని ఇబ్బంది పెట్టారని.. ఐతే ఆ విషయం ఆ విద్యార్థి వారి తల్లిదండ్రులకి చెప్పడం వల్ల వారు స్కూల్‌కి వచ్చి ఆందోళన చేశారు. విద్యార్థి సంఘాల మద్దతుతో వారు వచ్చి ప్రిన్సిపల్‌ని నిలదీశారు.