నిర్మల్ జిల్లా మామడ మండలం పోతారం గ్రామస్థులు... సర్పంచి, అతని అనుచరులపై కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని గెలిపిస్తే, గెలిపించిన ఆరునెలల్లోనే అటవీ, చెరువు శిఖం భూములు 12 ఎకరాలు కబ్జా చేసినట్లు ఆరోపించారు. కబ్జాదారులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వ భూములు కాపాడాలని కలెక్టరేట్లో వినతి - collectorate
గ్రామ సర్పంచితో పాటు మరికొంత మంది అటవీ, శిఖం భూములు కబ్జా చేస్తున్నారని నిర్మల్ జిల్లా పోతారం గ్రామస్థులు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వ భూములు కాపాడాలని కలెక్టరేట్లో వినతి