కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్మల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో వైకుంఠరథం ఏర్పాటు చేశారు. పురపాలక శాఖ కార్యాలయంలో మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ వాహనాన్ని ప్రారంభించారు.
అంత్యక్రియలకు వైకుంఠరథం ప్రారంభం - తెలంగాణ వార్తలు
కొవిడ్ బారిన పడి మృతి చెందిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్మల్ మున్సిపల్ శాఖ వైకుంఠరథం ఏర్పాటు చేసింది. మహమ్మారి కారణంగా ఎవరు చనిపోయినా మున్సిపల్ సిబ్బందికి తెలియజేయాలని ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ తెలిపారు.
Vaikuntaratham, nirmal news
కొవిడ్‌తో మరణించిన వ్యక్తులకు అంతిమ సంస్కారాలు నిర్వహించలేని దయనీయ పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని గండ్రత్ ఈశ్వర్ అన్నారు. కరోనాతో ఎవరు చనిపోయినా మున్సిపల్ సిబ్బందికి తెలియజేయాలని.. వారే వచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలిపారు. వైకుంఠరథం కోసం 9908114477, 984990588, 7036661060 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
ఇదీ చూడండి:ప్రజలు కరోనాతో మరణిస్తుంటే.. మీకు ఇది అవసరమా?: హైకోర్టు