తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కాటు.. 20 రోజుల్లో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి - telangana news updates

కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలిగొంటుంది. తాజాగా కరోనా సోకి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందిన ఘటన నిర్మల్​ జిల్లాలో చోటుచేసుకుంది.

corona
corona

By

Published : May 14, 2021, 2:28 PM IST

కరోనా మహమ్మారి కొన్ని కుటుంబాలపై కక్ష పడుతోంది. నిర్మల్​ జిల్లా సోన్​ మండలంలోని న్యూవెల్మల్​ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇరువై రోజుల వ్యవధిలో కరోనా బారినపడి మృతి చెందడం గ్రామస్థులను తీవ్రంగా కలచివేసింది. గ్రామానికి చెందిన రాజ్​కుమార్​(35) అనే యువకుడు కరోనా వ్యాధితో గురువారం మృతిచెందాడు.

గత 15 రోజుల క్రితం కొవిడ్​ సోకడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు అసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇరువై రోజుల వ్యవధిలో తల్లి శకుంతల(70), తండ్రి కిషన్​(75) కరోనా వైరస్​తో చికిత్స పొందుతూ మరణించారు. చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న కుటుంబంలో ముగ్గులు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి: చికిత్స కోసం వచ్చే ఇతర రాష్ట్రాల రోగులకు మార్గదర్శకాలు

ABOUT THE AUTHOR

...view details