ఉపాధి హామీ ప్రజా వేదికలో గందరగోళం - ఉపాధి హామీ
నిర్మల్ జిల్లా తనూర్ మండలంలో జరిగిన 11వ విడత ఉపాధి హామీ ప్రజావేదిక కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేడయంతో గొడవ సద్దుమణిగింది.
ఉపాధి హామీ ప్రజా వేదికలో గందరగోళం
నిర్మల్ జిల్లా తనూర్ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 11వ విడత ఉపాధి హామీ ప్రజావేదిక నిర్వహించారు. పనుల గురించి అధికారులు ఆరా తీస్తుండగా... పలు గ్రామాల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. చిన్న వాగ్వాదంతో మొదలై.. గొడవకు దారి తీయడం వల్ల పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాల్ని సముదాయించి ప్రజా వేదికను తిరిగి ప్రారంభించారు.
- ఇదీ చూడండి : ఎన్ఆర్సీలో 19.06 లక్షల మందికి దక్కని చోటు