సమీక్ష పేరుతో చంపేస్తారా...మృతుని బంధువుల ఆరోపణ.. - review
నిర్మల్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయడంటూ..అతని బంధువులు ఆరోపించారు. అనంతరం వారు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.
నిర్మల్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక తోకల చిన్నయ్య అనే వ్యక్తి మృతి చెందాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. కడుపు నొప్పి భరించలేక ఆసుపత్రిలో చేరారని..వైద్యాధికారితో సమీక్ష సమావేశంలో డాక్టర్లు ఉండడం వల్ల చికిత్స అందించలేదని వారి బంధువులు చెబుతున్నారు. అనంతరం ఆసుపత్రి ఎదుట అందోళన చేపట్టారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై రమణారావు వారికి నచ్చజెప్పారు.
ఇదీచూడండి:ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న టిప్పర్.. ఇద్దరు మృతి