నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్‌లోని అయ్యప్ప ఆలయంలో భక్తులకు దర్శనం నిలిపివేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారి గురుస్వామి నర్సారెడ్డి తెలిపారు.
అయ్యప్ప ఆలయంలో దర్శనం నిలిపివేత - కరోనా రెండో దశ
నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్‌లోని అయ్యప్ప ఆలయంలో భక్తులకు దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. కొవిడ్ రెండో దశ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
kadthal ayyappa temple
స్వామివారికి ఏకాంత పూజలు కొనసాగుతాయని నర్సారెడ్డి వివరించారు. దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు గమనించాలని కోరారు. కరోనా నివారణకు అంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.