ETV Bharat / state
రైతులకు అండగా నిలిచింది మోదీ ప్రభుత్వమే - 2019 TELANGANA ELECTIONS
రైతులను అన్ని విధాలా ఆదుకుంది మోదీ ప్రభుత్వమేనని ఆదిలాబాద్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి సోయం బాపూరావు అన్నారు. తనను గెలిపిస్తే జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఐస్క్రీం బండి తోస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న సోయం బాపూరావు
By
Published : Apr 4, 2019, 3:40 PM IST
| Updated : Apr 4, 2019, 3:56 PM IST
నిర్మల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న సోయం బాపూరావు కాంగ్రెస్ హయాంలో ఎరువులు దొరకక రైతులు ఆందోళన చేస్తే అన్నదాతలపై లాఠీ ఛార్జ్ చేయించారని ఆదిలాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి సోయం బాపూరావు ఆరోపించారు. కర్షకులకు అండగా నిలిచిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది మోదీ ప్రభుత్వమేనని అన్నారు. నిర్మల్ జిల్లాలో రోడ్ షో నిర్వహించి... చాయ్ పోస్తూ, ఐస్క్రీం బండి తోస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. Last Updated : Apr 4, 2019, 3:56 PM IST