నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో హిందు వాహిని, హిందు విభాగ్ల ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణ మహోత్సవం నిరాడంబరంగా జరిగింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో శ్రీరాముడి శోభాయాత్రను రద్దు చేసినట్లు హిందూ విభాగ్ జిల్లా కార్యదర్శి సుంకరి సాయి వివరించారు.
హిందూవాహిని ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు - telangana news
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం నిరాడంబరంగా జరిగింది. శ్రీరాముడి విగ్రహానికి ఆలయ అర్చకులు.. ప్రత్యేక పూజలు చేశారు.
నిరాడంబరంగా రామ నవమి
ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. జాగ్రత్తలు తీసుకోవాలని సాయి సూచించారు. కరోనా కట్టడికి అంతా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.