ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ ప్రకటించకుండా రాష్ట్ర ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని.. తెలంగాణ ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా అధ్యక్షులు గోనె శశిరాజ్ విమర్శించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ ప్రకటించాలని కోరుతూ.. నిర్మల్ కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
పరిష్కరించాలి..
ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారం, పదోన్నతులు బదిలీలు నిర్వహించకుండా ప్రభుత్వం కాలం వెళ్లదీస్తుందని ఆరోపించారు. ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టుల భర్తీ, కేజీబీవీ ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్ చేయాలని కోరారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని లేకపోతే.. ప్రభుత్వమే విద్యుత్ బిల్లులు చెల్లించాలన్నారు. పాఠశాలలో స్కావెంజర్లను కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అంకం సుధాకర్, గౌరవ అధ్యక్షులు జి.రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:హైదరాబాద్లో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు