నిర్మల్ మున్సిపల్ కార్యాలయ సిబ్బందిపై గురువారం ఉదయం గాంధీ కూరగాయల మార్కెట్లో దాడికి జరిగిన నేపథ్యంలో విధులు బహిష్కరించిన సిబ్బంది తిరిగి ఈరోజు విధుల్లోకి చేరారు. దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేయడంతో తమ సమ్మెను విరమించుకొని విధులకు హాజరవుతున్నట్లు కమిషనర్ రవిబాబు తెలిపారు.
తమ సమ్మె వల్ల పట్టణ వాసులను ఇబ్బందులకు గురి చేసినందుకు క్షమించాలని, తమ సమస్యను అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. ఎక్కడైనా పారిశుద్ధ్య సమస్య ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే త్వరితగతిన పరిష్కరిస్తామని సిబ్బంది వివరించారు. తమ డిమాండ్‌ను నెరవేర్చినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు
సమ్మె విరమించిన మున్సిపల్ ఉద్యోగులు.. - nimal
ఇటీవల నిర్మల్ మున్సిపల్ కార్యాలయ సిబ్బందిపై దాడి జరిగిన నేపథ్యంలో విధులు బహిష్కరించిన ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో సమ్మె విరమించారు.
సమ్మె విరమించిన మున్సిపల్ ఉద్యోగులు..
ఇవీ చూడండి: