నిర్మల్ జిల్లా భైంసా డిపో ఎదురుగా ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన వేతనాల బిల్లు, ఉద్యోగ భద్రత బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర సంస్థలలో పని చేస్తున్న కార్మికులకు రోజువారీ కనీస వేతనం రూ.580 నుంచి రూ.178లకు తగ్గించడం దారుణమన్నారు.
భైంసాలో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ధర్నా - nirmal
కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వేతన బిల్లు, ఉద్యోగ భద్రత బిల్లును ఉపసంహరించుకోవాలని నిర్మల్ జిల్లా భైంసా ఆర్టీసీ డీపో ముందు కార్మికులు ధర్నా చేశారు.
ఆర్టీసీ కార్మికులు