తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆధునిక సేద్యం.. అధిక లాభం: మంత్రి ఇంద్రకరణ్ - అధిక దిగుబడులు వచ్చి రైతుకు మేలు : ఇంద్ర కరణ్

వానాకాలం ప్రారంభంలోనే పంటలు వేయాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన సూచన మేరకు.. నిర్మల్ జిల్లా ఎల్లపల్లిలో మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి దుక్కి దున్నారు. కార్తెలకు అనుగుణంగా పంటలు సాగు చేస్తే.. అధిక దిగుబడులు వచ్చి రైతుకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

Rohini to start farming in Carthage - Minister Indrakaran
ఆధునిక సేద్యం.. అధిక లాభం: మంత్రి ఇంద్రకరణ్

By

Published : May 27, 2020, 3:13 PM IST

రోహిణీ కార్తెలో సాగు మొదలుపెడితే.. రైతుకు లాభం చేకూరుతుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వానాకాలం ప్రారంభంలోనే పంటలు వేయాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన సూచన మేరకు.. నిర్మల్ జిల్లా ఎల్లపల్లిలో మంత్రి దుక్కి దున్నారు.

కార్తెలకు అనుగుణంగా పంటలు సాగు చేస్తే.. అధిక దిగుబడులు వచ్చి రైతుకు మేలు జరుగుతుందని మంత్రి ఇంద్రకరణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కర్షకుల నుంచి విశేష స్పందన వస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. ఈపంటలకు చీడపీడల ఉద్ధృతి కూడా తక్కువగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చూడండి:రైతులను నిండాముంచిన అకాల వర్షం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details