కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం రోజు నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి చేతిలో పాఠ్యపుస్తకం ఉండాలని పాఠ్య పుస్తకాల పంపిణీ నిర్మల్ జిల్లా మేనేజర్ వెంకటరమణ అన్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఉన్న పంపిణీ కేంద్రంలో పాఠ్యపుస్తకాల పంపిణీని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు 3లక్షల 56 వేల పాఠ్యపుస్తకాలు అవసరమున్నాయన్నారు. ఇప్పటివరకు 2లక్షల 96 వేల పాఠ్యపుస్తకాలు వచ్చాయని పేర్కొన్నారు. మిగిలిన 60 వేల పుస్తకాల పంపిణీ కూడా రాగానే పూర్తిచేస్తామన్నారు. జూన్ 1 నుంచి పాఠశాల తరగతులు ప్రారంభంకానున్నాయని.. ఈలోపు విద్యార్థులకు పుస్తకాలను చేర్చాలన్న లక్ష్యంతోనే పుస్తకాల పంపిణీ మొదలెట్టామని వివరించారు.
"ప్రతి విద్యార్థి చేతిలో పాఠ్య పుస్తకముండాలి" - nirmal
విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి చేతిలో పాఠ్య పుస్తకం ఉండాలనే లక్ష్యంతో పంపిణీని ప్రారంభించామని నిర్మల్ జిల్లా పుస్తకాల పంపిణీ కేంద్రం మేనేజర్ వెంకటరమణ తెలిపారు.
ప్రతి విద్యార్థి చేతిలో పాఠ్య పుస్తకముండాలి