నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవార్‌పేట్ ప్రాంతానికి చెందిన నరేశ్‌కు... విద్యుదాఘాతం వల్ల జరిగిన ప్రమాదంలో రెండు చేతులు తొలగించారు. అయినప్పటికీ... ఆత్మవిశ్వాసం కోల్పోకుండా జీవితాన్ని సాగిస్తున్నాడు. ప్రస్తుతం పుర ఎన్నికల్లో భాగంగా 37వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకొని ఓటర్లకు ఆదర్శంగా నిలిచాడు. అందుకు గుర్తుగా ఎన్నికల కేంద్రంలో సిబ్బంది నరేశ్ ముంజేయికి సిరా చుక్కను వేయడం విశేషం.
చేతుల్లేకపోయినా.. ఓటేసి స్ఫూర్తినిచ్చాడు
విద్యుదాఘాతం వల్ల జరిగిన ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన ఓ యువకుడు... మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
చేతుల్లేకపోయినా.. ఓటేసి స్ఫూర్తినిచ్చాడు