తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా నిర్మల్​ చివరి పాలకవర్గ సమావేశం - muncipality

నిర్మల్​ మున్సిపాలిటీ పాలకవర్గ సమావేశం పండగ వాతావరణంలో జరిగింది. పురపాలక అధ్యక్షుడు అప్పల గణేశ్​ చక్రవర్తి తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

పాలక వర్గ అధ్యక్షుడిని సత్కరిస్తున్న సభ్యులు

By

Published : Jun 28, 2019, 7:47 PM IST

నిర్మల్ పురపాలక సంఘ పాలకవర్గం ఐదేళ్లు పూర్తి చేసుకుంది. చివరి పాలకవర్గ సమావేశం ఆహ్లాదకరంగా జరిగింది. నిర్మల్​ పట్టణ అభివృద్ధిలో తనకు సహకరించిన అధికారులు, ప్రజలు, నాయకులకు మున్సిపాలిటీ అధ్యక్షుడు అప్పల గణేశ్​చక్రవర్తి కృతజ్ఞతలు చెప్పారు. గడిచిన 5 ఏళ్లలో పట్టణ అభివృద్ధికి పాలకవర్గం ఎంతో కృషి చేసిందని అన్నారు. నిర్మల్​ పట్టణం పరిశుభ్రతలో దేశంలో 48వ స్థానం, రాష్ట్రంలో 8వ స్థానం దక్కిందని తెలిపారు. చివరి సమావేశానికి 21 మంది కౌన్సిలర్లు, ఓ కోఆప్షన్ సభ్యుడు హాజరయ్యారు.

ఘనంగా నిర్మల్​ చివరి పాలకవర్గ సమావేశం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details