జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని... నిర్మల్ కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొత్తం 6,686 రెండు పడక గదుల ఇళ్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు. వాటిలో నిర్మల్ నియోజకవర్గంలో 3,761, ముథోల్‌లో 2,240, ఖానాపూర్‌లో 685 ఇళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సంబంధిత శాఖ అధికారులు, గుత్తేదారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
'రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలి' - Nirmal District latest news
నిర్మల్ జిల్లాలో చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని... జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సంబంధిత శాఖ అధికారులు, గుత్తేదారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
'రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలి'
5,641 గృహాలకు పరిపాలన అనుమతులు లభించాయని, 3,184 ఇళ్లకు టెండరు ప్రక్రియ పూర్తి చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 951 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని అన్నారు. మిగతావి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. గుత్తేదారుల పెండింగ్ బిల్లుల చెల్లింపునకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిర్మాణ పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'అక్షర సినిమా సమాజంలో స్ఫూర్తి నింపాలి'