రాష్ట్రంలో మహిళలకు శాంతి భద్రతలు కరువయ్యాయని నిర్మల్ జిల్లా భాజపా మహిళా మోర్చా ఆవేదన వ్యక్తం చేసింది. భైంసా ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ కలెక్టరేట్లో నేతలు వినతిపత్రం సమర్పించారు.
'రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది'
భైంసా ఘటనపై.. నిర్మల్ జిల్లా భాజపా మహిళా మోర్చా మండి పడింది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
'రాష్ట్రంలో మహిళలకు శాంతి భద్రతలు కరవయ్యాయి'
భైంసా ఘటన బాధితులకు.. ప్రభుత్వం కనీసం అండగా నిలవలేదంటూ భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి మండిపడ్డారు. ఘటన మరువక ముందే మీర్జాపూర్లో చిన్నారిపై జరిగిన లైంగిక దాడిని చూస్తే.. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోందన్నారు.
ఇదీ చదవండి:శివరాత్రి పూట రేవ్‌పార్టీ... పోలీసుల అదుపులో 90 మంది..