నిర్మల్ జిల్లాలో వంద శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరగాలని జిల్లా పాలానాధికారి ముషారఫ్ ఫారూఖీ వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాలపై వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలలో గర్భిణీల నమోదు, జరుగుతున్న ప్రసవాలపై మండలాల వారీగా చర్చించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో అధిక సంఖ్యలో ప్రసవాలు జరిగేలా డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు కృషి చేయాలని కలెక్టర్ అన్నారు.
వంద శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి: కలెక్టర్ - వైద్యాధికారులతో కలెక్టర్ సమావేశం
నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాలపై వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ సమీక్ష నిర్వహించారు. వంద శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానాల్లోనే జరిగేలా చూడాలని జిల్లా పాలనాధికారి వైద్యాధికారులను ఆదేశించారు.
ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేయాలని, అందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలనీ జిల్లా వైద్యాధికారి వసంత్ రావును కలెక్టర్ ఆదేశించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై పూర్తి నమ్మకం కలిగేలా డాక్టర్లు పనిచేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవం జరిగితే కేసీఆర్ కిట్‌తో పాటు రూ.12,000 నగదు అందిస్తామని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోవద్దని ప్రజలకు వైద్యసిబ్బంది అవగాహన కల్పించాలన్నారు.
ఇవీ చూడండి: మొత్తం 15 బృందాలు.. ఒక్కో జిల్లా నుంచి 400 నమూనాలు