తెలంగాణ

telangana

ETV Bharat / state

'జిల్లా అభివృద్ధికి ప్రజల సహకారం కూడా అవసరం'

జిల్లాను అభివృద్ధిపథంలో నడిపేందుకు ప్రజల సహకారం కూడా అవసరమని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పలు సంక్షేమశాఖల ద్వారా జిల్లాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

nirmal collector conducts media confernce on district development
'జిల్లా అభివృద్ధికి ప్రజల సహకారం కూడా అవసరం'

By

Published : Jan 1, 2021, 12:44 PM IST

పల్లె ప్రగతి కార్యక్రమంలో.. జిల్లా, రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిందని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలల్లో ఈ-ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని.. పలు సంక్షేమశాఖల ద్వారా జిల్లాలో జరిగిన అభివృద్ధిని వివరించారు. జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు.. అధికార యంత్రాంగంతో పాటు ప్రజలు కూడా సహకరించాలని కోరారు.

జిల్లాలో కరోనా నివారణకు వైద్యారోగ్య శాఖ, మున్సిపల్, పోలీస్ సిబ్బంది ఎంతో కృషి చేశారని కలెక్టర్​ పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ పథకం కింద వీధి వ్యాపారులకు రుణాలు అందించడంలో నిర్మల్ మున్సిపాలిటీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి దారేది?

ABOUT THE AUTHOR

...view details