శాంతి భద్రతల కోసం నిర్మల్ జిల్లా భైంసాలోని శివాజీనగర్‌లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ శశిధర్ రాజ్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది సిబ్బంది ఇంటింటికి వెళ్లి సోదాలు జరిపారు. సరైన పత్రాలు లేని 140కు పైగా ద్విచక్రవాహనలు, 10ఆటోలు, ఒక ట్రాక్టర్, 6వేల విలువ గల మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
శాంతి భద్రతలకై నిర్బంధ తనిఖీలు
ప్రజలకు, పోలీసులకు మధ్య సత్సంబంధాలు పెరిగేందుకు నిర్బంధ తనిఖీలు ఉపయోగపడతాయని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సోదాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్
ఇవీ చూడండి: లోక్‌సభ ఎన్నికల వేళ... నోట్ల కట్టల కళకళ