నిర్మల్ జిల్లా మామడ మండలం న్యూ సాంగ్విలో రైతులు పెద్దఎత్తున ఆందోళన చేశారు. అక్రమ డీ-1 పట్టాల జారీని వెంటనే రద్దు చేయాలంటూ... నిర్మల్- మంచిర్యాల రహదారిపై మూడు గంటల పాటు ధర్నా నిర్వహించారు. అధికారులు వచ్చే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.
అక్రమ డీ-1 పట్టాలు రద్దుచేయాలంటూ రైతుల ఆందోళన - nirmal news
అక్రమ డీ-1 పట్టాలు వెంటనే రద్దు చేయాలంటూ నిర్మల్ జిల్లా మామడ మండలం న్యూ సాంగ్వి రైతులు నిరసనకు దిగారు. నిర్మల్- మంచిర్యాల రహదారిపై మూడు గంటలపాటు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. రాస్తారోకో వల్ల సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ఎంతసేపటికీ అధికారులు రాకపోవటం వల్ల ఓ రైతు పురుగుల మందు తాగేందుకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అడ్డుకున్నారు. గత కొన్ని రోజులుగా న్యూ సాంగ్విలో అక్రమ డీ-1 పట్టాలు సృష్టించి భూములను కబ్జా చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా... పట్టించుకోవట్లేదని రైతులు ఆరోపించారు.
పట్టాలు సృష్టించిన అధికారులపై వెంటనే చర్యలు తీడుకోవాలని డిమాండ్ చేశారు. దాదాపు 3 గంటల పాటు రాస్తారోకో నిర్వహించగా... ఇరువైపులా 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చివరకు తహసీల్దార్ ఘటన స్థలానికి చేరుకొని 8 రోజుల్లో డీ-1 పట్టాల జారీపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని నచ్చచెప్పగా... నిరసనకారులు ఆందోళన విరమించారు.