స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎగిరి ఎగరని జెండాను జిల్లా పాలనాధికారి ఎం. ప్రశాంతి ఆవిష్కరించి వెళ్లారు. పాలకవర్గం గడువు తీరిపోవడంతో జిల్లా కలెక్టర్ వచ్చి జెండాను ఎగురవేశారు. హడావుడిగా వచ్చి జెండా ఎగరవేయడం వల్ల జెండా సరిగా ఎగరకుండా మధ్యలోనే చిక్కుకుపోయింది. అయినప్పటికీ జెండావందనం పూర్తిచేసి వెళ్లిపోయారు.
అసంపూర్తిగా జెండా ఆవిష్కరించిన కలెక్టర్ - మున్సిపల్ కార్యాలయం
నిర్మల్‌జిల్లా మున్సిపల్ కార్యాలయంలో జెండా పండుగలో అపశృతి చోటుచేసుకుంది. హడావుడిగా దేశ భక్తి చాటి వెళ్లారు జిల్లాపాలనాధికారి.
అసంపూర్తిగా జెండా ఆవిష్కరించిన కలెక్టర్