తెలంగాణ

telangana

ETV Bharat / state

తనయుడికి కడదాకా తోడుగా నిలిచిన పేగు బంధం - son

అనారోగ్యంతో బాధపడుతున్నాడని భార్య వదిలేసినా, తనయుడికి కడదాకా ఓ మాతృమూర్తి తోడుగా నిలిచింది. కుమారుడి చావును చూసి తట్టుకోలేక తల్లి పడిన రోదన అందరిని కలచివేసింది. ఈ ఘటన నిర్మల్​ జిల్లా ముథోల్​లో చోటుచేసుకుంది.

తనయుడికి కడదాకా తోడుగా నిలిచిన పేగు బంధం

By

Published : Apr 30, 2019, 1:38 PM IST

తనయుడికి కడదాకా తోడుగా నిలిచిన పేగు బంధం

నవమాసాలు మోసి కనిపెంచిన ఓ తల్లి... తనయునికి కడదాకా తోడైంది. అనారోగ్యం కారణంగా కట్టుకున్న భార్య అర్ధాంతరంగా వదిలేసినా... కడదాకా తోడు ఉంటానంటూ శత ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ కుమారుడు దక్కలేదు. కళ్ల ముందే తనయుడు తనను వీడుతుండగా ఆ తల్లి రోదన అందరిని కలచివేసింది.

తల్లి రోదనను చూసి కంటతడిపెట్టుకున్న ప్రయాణికులు

మహారాష్ట్రలోని ఉమ్రి పక్కన ఉన్న సవర్గావ్ గ్రామానికి చెందిన కుమ్మర్వర్ ఆనంద కిడ్నీ వ్యాధితో గత మూడు నెలలుగా బాధపడుతున్నాడు. మొదట ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చూపించినపుడు కిడ్నీ సమస్య ఉందని వైద్యులు చెప్పడం వల్ల భార్య వదిలేసింది. గత కొన్ని రోజుల నుంచి కన్న తల్లే నిజామాబాద్​లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తోంది. ముథోల్ నుంచి నిజామాబాద్​కు వెళ్లడానికి బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో అతను అకస్మాత్తుగా చనిపోయాడు. బస్టాండ్​లో తనయుడి మృతదేహం వద్ద ఏడుస్తూ కూర్చున్న ఆ తల్లిని చూసి పలువురు ప్రయాణికులు కూడా కంటతడి పెట్టారు.

ఇవీ చూడండి: ఇళ్ల విక్రయాల్లో హైదరాబాదే బాద్​షా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details