తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్మల్​ జిల్లాలో మంత్రి కొడుకు హల్​చల్​... - నిర్మల్​ పోలింగ్​ కేంద్రాలు

పోలింగ్​ కేంద్రంలోకి మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి కొడుకు, కోడలిని పోలీసులు అనుమతించడం దిలావర్​పూర్​లో వివాదాస్పదమైంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడం వల్ల అధికారులు పోలింగ్​ కేంద్ర పరిధిలో 144 సెక్షన్​ విధించారు. తెరాసకు వత్తాసు పలుకుతోన్న ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్​ నాయకులు డిమాండ్​ చేశారు.

కాంగ్రెస్​ ఆందోళన

By

Published : May 6, 2019, 1:06 PM IST

Updated : May 6, 2019, 2:33 PM IST

నిర్మల్‌ జిల్లాలోని దిలావర్‌ పూర్‌ పోలింగ్‌ కేంద్రంలోకి రాష్ట్రమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తనయుడు గౌతంరెడ్డి, ఆయన సతీమణి దివ్యారెడ్డిని పోలీసులు అనుమతించడం వివాదాస్పదమైంది. తెరాస అభ్యర్థుల తరఫున అమాత్యుని కుమారుడు, కోడలు సహా మరో పది మంది వెళ్లినా అధికారులు అడ్డుకోలేదు. పోలీసుల తీరుపై కాంగ్రెస్​ శ్రేణులు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడం వల్ల అక్కడ 144 సెక్షన్​ విధించారు. నిర్మల్​ గ్రామీణ ఎస్సై రాజు తెరాసకు వత్తాసు పలుకుతున్నారని హస్తం నాయకులు ఆరోపించారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్​ నేత మహేశ్వర్​రెడ్డి డిమాండ్​ చేశారు.

దిలావర్​పూర్​ పోలింగ్లో​ కేంద్రంలో కాంగ్రెస్​ ఆందోళన
Last Updated : May 6, 2019, 2:33 PM IST

ABOUT THE AUTHOR

...view details