గణేష్ నిమజ్జనం నేపథ్యంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పర్యటించారు. పట్టణంలోని నిమజ్జనం చేస్తున్న స్థలాన్ని, ఏర్పాట్లను పరిశీలించి... గణేష్ విగ్రహాలకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలందరూ శాంతియుతంగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన కొవిడ్ నిబంధనల ప్రకారం శోభాయాత్ర చేసుకోవాలని సూచించారు.
'ప్రజలు శాంతియుతంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిర్వహించుకోవాలి'
భైంసా పట్టణంలో గణేష్ నిమజ్జనం చేస్తున్న స్థలాన్ని, ఏర్పాట్లను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు. గణేష్ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ శాంతియుతంగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన కొవిడ్ నిబంధనల ప్రకారం శోభాయాత్ర చేసుకోవాలని మంత్రి సూచించారు.
'ప్రజలు శాంతియుతంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిర్వహించుకోవాలి'
గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా 9వ రోజు పట్టణంలో ఉదయం నుంచి ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు తక్కువ మందితో వినాయక చవితి, మొహరం పండుగలను ఇండ్లలోనే జరుపుకోవాలని సూచించడం వల్ల భక్తులు కూడా సహకరిస్తున్నారని అన్నారు.
ఇవీ చూడండి: యాదాద్రి ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ