రాష్ట్రంలో పంట సాగు విధానంలో మార్పు రావాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను ఎక్కువగా పండించాలని విజ్ఞప్తి చేశారు. నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్ లో జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి సభ్యులతో పంటసాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. వానాకాలం-2020, సాగు సమాయత్తం, రోహిణి కార్తె లో వరి నారు - సాగుపై రైతులకు వివరించారు.
డిమాండ్ కు తగ్గట్టు.. పంటలు పండించాలి: ఇంద్రకరణ్ రెడ్డి - Telangana government has allocated Rs. 25 thousand crores of funds
నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్ లో జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి సభ్యులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పంటలసాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. వానాకాలం-2020, సాగు సమాయత్తం, రోహిణి కార్తె లో వరి నారు - సాగుపై రైతులకు వివరించారు. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం రూ. 25 వేల కోట్లు నిధులు కేటాయించినట్లు తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల సంక్షేమానికి అనేక పథకాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అమలు చేస్తూన్నారని మంత్రి ఇంకరణ్ పేర్కొన్నారు. రైతులు ఓకేపంట వేసి నష్ట పోకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించారు. సేంద్రియ పంటలను పండించాలని.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. వరి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం రూ. 25 వేల కోట్లు నిధులు కేటాయించిందన్నారు.
ఇదీ చూడండి:ప్రాణాలు తీసే కంపెనీ మాకొద్దు: ఆర్ఆర్ వెంటాపురం గ్రామస్థులు