ఈనెల 25లోగా జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లను పూర్తిచేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోళ్లు, డబుల్ బెడ్రూం నిర్మాణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోళ్లు, తరలింపుపై మండలాల వారీగా సమీక్షించారు. మొక్కజొన్నలను మే 25వ తేదీలోపు పూర్తిగా కొనుగోలు చేయాలని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్‌ను ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్లు, డబుల్ బెడ్రూం నిర్మాణాలపై మంత్రి సమీక్ష - paddy purchase
నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లు, డబుల్ బెడ్రూం నిర్మాణాలపై అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మే 25లోగా మెుక్కజొన్న కొనుగోళ్లను పూర్తి చేయాలని, పూర్తయిన రెండు పడక గదుల నిర్మాణాలలో సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
అధికారుల లెక్కల ప్రకారం లక్ష మెట్రిక్ టన్నుల మొక్కజొన్న వస్తుందని అంచనా వేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 69 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నల కొనుగోళ్లు జరిగాయన్నారు. అందులో నుంచి 46వేల 500 మెట్రిక్ టన్నులు గోదాములకు తరలించామని మంత్రి తెలిపారు. మిగతా ధాన్యాన్ని కూడా గోదాములకు తరలించి, కొనుగోళ్లను కూడా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయుటకు ప్రణాళిక రూపొందించాలని జిల్లా నోడల్ అధికారిని మంత్రి ఆదేశించారు.
ఇవీ చూడండి: డిమాండ్ కు తగ్గట్టు.. పంటలు పండించాలి: ఇంద్రకరణ్ రెడ్డి