తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్మల్​లో మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ప్రచారం - తెరాస ఎన్నికల ప్రచారం

పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెరాస నాయకులు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నిర్మల్​ జిల్లాలో ఎంపీ అభ్యర్థి నగేష్​ను గెలిపించాలంటూ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి ప్రచారం నిర్వహించారు. మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రి ప్రచారం

By

Published : Apr 4, 2019, 5:52 AM IST

ప్రచారంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి
నిర్మల్​ జిల్లాలో దేవాదాయ, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మామడ, లక్ష్మణచాద గ్రామాల్లో పర్యటించారు. స్థానికులు, మహిళలతో సమావేశమయ్యారు. తెరాస పథకాలను వివరించి ఓట్లను అభ్యర్థించారు. పార్టీ పార్లమెంటు అభ్యర్థి నగేష్​ను మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ ఎంపీని గెలిపిస్తే జిల్లాలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. తమ ఓటు ద్వారా కాంగ్రెస్​ నాయకులకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.

ABOUT THE AUTHOR

...view details