ప్రతి పేదవాడు రెండు పడకల ఇంటిలో సకల సౌకర్యాలతో... దర్జాగా కాలుమీద కాలేసుకుని బతకాలన్న సీఎం కేసీఆర్ మహోన్నత ఆశయం మేరకే... డబుల్ బెడ్ రూం పథకం కొనసాగుతోందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సిద్ధాపూర్‌లో రూ. 31.80 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 600 ఇండ్ల నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు.
'పేదవాడు... కాలుమీద కాలేసుకుని బతకాలన్నదే సీఎం ఆశయం' - Minister Allola Indrakaran Reddy news
పేదలు ఆత్మ గౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం పథకం ప్రవేశ పెట్టారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ఎక్కడ అభివృద్ధి పనులు ఆగలేదని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు నిధులు మంజూరు చేసి లబ్ధిదారులకు అందజేస్తున్న ఘనత ఒక్క తెరాస ప్రభుత్వానికే దక్కిందని తెలిపారు.
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
పేదలు ఆత్మ గౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో తెరాస పాలన సాగుతోందని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ఇండ్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు అందజేస్తామని తెలిపారు. నిర్మల్ పట్టణ వాసుల కోసం 2100 ఇండ్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. సొంత స్థలాలు ఉన్న వారు స్వయంగా వారే డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు.
ఇదీ చదవండి: పల్లెల్లో త్వరలో 'గూగుల్' ఆక్సిజన్ ప్లాంట్లు