నిర్మల్ మండలంలోని ఆనంతపేటలో 58 లక్షలతో శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి, భీమన్న ఆలయాలకు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమిపూజ చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా నిండి నీలాయిపేట్లో మొక్కలు నాటారు. దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నిర్మల్ నియోజకవర్గంలో 500 దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేశామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరు తమ గ్రామాల్లో మొక్కలు నాటి వాటిని బాధ్యతగా సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ విజయలక్ష్మి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, ఎస్పీ శశిధర్ రాజు పాల్గొన్నారు.
'నిర్మల్లో 500 దేవాలయాల అభివృద్ధికి నిధులు' - ఆనంతపేట
తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎప్పుడూ లేనివిధంగా దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
'నిర్మల్లో 500 దేవాలయాల అభివృద్ధికి నిధులు'