నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో భక్తుల రద్దీ పెరిగింది. పిల్లలకు అక్షర అభ్యాసం చేయించడానికి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున దేవస్థానానికి తరలి వస్తున్నారు. చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయిస్తే శుభం కలుగుతుందని వేకువజాము నుంచే ఆలయానికి చేరుకుంటున్నారు. భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా భక్తులు బాసరకు తరలివస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు.
బాసరలో అక్షరాభ్యాసాల కోలాహలం - basara
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముస్తుండుగా చిన్నారులకు అక్షర అభ్యాసం చేయించడానికి తరలొస్తున్నారు.
అక్షర అభ్యాసం