నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ సమీపంలో ఉన్న రాయల్ ట్రాన్స్పోర్ట్ దుకాణంలో నిషేధిత గుట్కా సంచులు పట్టుబడ్డాయి. పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు తనిఖీ చేయగా సంచుల్లో నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.6 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. గుట్కా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఎవరికి చేరవేస్తున్నారనే కోణంలో విచారణ చేస్తున్నారు.
రూ.6 లక్షల విలువైన గుట్కా పట్టివేత - GUTKA Recovery in Nirmal district
నిర్మల్ జిల్లా కేంద్రం శివాజీ చౌక్‌లో ఉన్న రాయల్ ట్రాన్స్పోర్ట్ దుకాణంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి రూ.6లక్షల నిషేధిత గుట్కా పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. డీసీయం వాహనం డ్రైవర్, ట్రాన్స్పోర్ట్ దుకాణ యజమానిని అదుపులోకి తీసుకున్నారు.
రూ.6 లక్షల విలువైన గుట్కా పట్టివేత