నిర్మల్ జిల్లా సోన్ మండలంలో వారం రోజుల్లోనే మరోసారి గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. ఈనెల 20న గంజాల్ టోల్ ప్లాజా వద్ద సుమారు రూ.22 లక్షల గుట్కాను స్వాధీనం చేసుకున్న పోలీసులు, తాజాగా గురువారం సాయంత్రం రూ.12.4 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను సీజ్ చేశారు. రాష్ట్రంలో గుట్కాపై నిషేధం విధించడం వల్ల పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించామని ఎస్పీ శశిధర్‌రాజు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.